Visakhapatnam Tcs Building Allocated: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం మరింత విస్తరిస్తోంది. విశాఖపట్నంలో టీసీఎస్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రుషికొండ ఐటీ హిల్స్‌లో మిలీనియం టవర్స్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలో 2 వేల మంది ఉద్యోగులతో ప్రారంభమై, ఆ తర్వాత 6 వేలకు పెంచే అవకాశం ఉంది. మరోవైపు అమరావతిలో ఐబీఎం క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.