హైదరాబాద్‌లో పర్యావరణహిత మౌలిక సదుపాయాల దిశగా జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగం చేపట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారైన పేవర్ బ్లాకులతో కూడిన తొలి ఫుట్‌పాత్‌ను నిర్మించింది. పాలిథిన్ బ్యాగులు, బాటిళ్లు, ర్యాపర్లతో తయారు చేసిన ఈ బ్లాకులు 50 ఏళ్ల పాటు మన్నికగా ఉండనున్నాయి. వర్షంలో తడిస్తే జారకుండా గ్రిప్ కూడా ఇస్తాయని.. వేసవిలో వేడి తక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇవి సక్సెస్ అయితే మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు.