Andhra Pradesh Grant For Local Bodies: ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధుల కింద తొలి విడతగా రూ.988.77 కోట్లు విడుదల చేసింది. అందులో.. అన్‌టైడ్ గ్రాంట్లు రూ.395.50 కోట్లు, టైడ్ గ్రాంట్లు రూ.593.26 కోట్లు ఉన్నాయి. వీటిని రాష్ట్రంలో ఎంపిక చేసిన 9 జిల్లా పరిషత్‌లు, 615 మండల పరిషత్‌లు, 12,853 గ్రామ పంచాయతీలకు విడుదల చేశారు. రాజ్యాంగంలోని 243 జీ అధికరణ ప్రకారం.. పంచాయతీల్లో సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.