ఏపీకి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. అమరావతి హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం.. మరో గుడ్ న్యూస్ వినిపించింది. తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఆమోదించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ఈ వివరాలను వెల్లడించారు. రూ.1332 కోట్లతో 104 కిలోమీటర్ల మేరకు డబ్లింగ్ పనులు చేపట్టనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.