Andhra Pradesh Saci Funds Released: ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్రం స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కింద నిధులు విడుదల చేసింది. తొలి విడతగా ఏకంగా రూ.1500 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం ప్రతిపాదనలు పంపగా.. కేంద్రం ఓకే చెప్పింది.. ఈ మేరకు తొలి విడత నిధులు కూడా విడులయ్యాయి. కష్టకాలంలో ఉన్న ఏపీకి కేంద్రం నుంచి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పాలి.