ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఏపీలో మూడు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు.. కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద ఈ మేరకు సమాధానం ఇచ్చారు. రూ.310 కోట్లతో ఏపీలో మూడు చోట్ల టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో ఈ మూడు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విశాఖలో టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం పూర్తి చేసినట్లు వివరించారు.