ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బ్రాంచ్‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే త్వరలోనే ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రదానం చేయనుందని మంత్రి వివరించారు. నవంబర్‌లో రాజమండ్రిలో నంది డ్రామా ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.