ఏపీకి కేంద్రం తీపికబురు వినిపించింది. వీబీ జీరామ్‌జీ పథకం తొలివిడత నిధులను కేంద్రం విడుదల చేసింది. ఏపీకి రూ.2545 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నిధులను ఉపాధి కూలీల వేతనాలు, మెటీరియల్ వ్యయం, పరిపాలన వ్యయం కోసం కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు జులై ఒకటో తేదీ నుంచి వీబీ జీరామ్‌జీ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఉపాధి కల్పించే రోజులను కూడా 125కు పెంచింది.