పురావస్తు సర్వేక్షణ సంస్థ నల్లమల అటవీ ప్రాంతంలో చేపట్టిన సర్వేలో అలనాటి అమరావతి ఆనవాళ్లు కనిపించాయి. కాకతీయుల కాలం నాటి శాసనాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చారిత్రక సాక్ష్యాలను వెలుగులోకి తెచ్చిన పురావస్తు శాస్త్రవేత్తలను పవన్ కళ్యాణ్ అభినందించారు. వారసత్వ సంపద గుర్తింపు, సంరక్షణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలకుఅటవీశాఖ నుంచి నిరంతర సహకారం అందిస్తామన్నారు.