జ్ఞానేశ్వరిని ఎవరైనా తీసుకెళ్లి ఉంటే అప్పగించండి.. ఎలాంటి చర్యలు ఉండవు.. డీఎస్పీ ప్రకటన

2 months ago 11
కాకినాడ జిల్లాలో కనిపించకుండా పోయిన జ్ఞానేశ్వరి కేసులో డీఎస్పీ తిలక్ కీలక ప్రకటన చేశారు. ఎవరైనా చిన్నారిని తీసుకుని వెళ్లి ఉంటే.. పాపను తమకు అప్పగించాలని కోరారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇచ్చారు. నేరుగా రాకపోయినా పాప ఎక్కడ ఉందనే సమాచారం ఇచ్చినా సరే.. పోలీసులు వెళ్లి తీసుకొస్తారని చెప్పారు. చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చాలనేదే తమ లక్ష్యమని మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ తిలక్ ప్రకటించారు.
Read Entire Article