ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఊతం ఇచ్చింది. రూ.2,787 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగుల నివాస సముదాయం నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మిస్తారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మరోవైపు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిలో 22.53 ఎకరాల భూమిని కూడా ఈ నిర్మాణాల కోసం కేటాయించింది.