AP Get 750 Electric Buses In 11 Cities: ఏపీకి కేంద్రం నుంచి ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. కేంద్రం అందిస్తోన్న పీఎం ఈ-బస్ సేవా పథకంలో భాగంగా మొదటి దశలో 11 నగరాల్లో 750 విద్యుత్ బస్సులు రాబోతున్నాయని సీఎస్ సాయిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పీఎం ఈ బస్ సేవా ఫథకం పూర్తి స్థాయిలో వినియోగానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.