Union minister Kinjarapu Ram mohan naidu Comments on New airports in AP: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో అదనంగా మరిన్ని ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత కీలక వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఎయిర్ పోర్టుల సంఖ్యను ఏడు నుంచి 14కు పెంచాలనేదే తమ ఉద్దేశమన్న రామ్మోహన్ నాయుడు.. ఇందుకోసం చంద్రబాబు మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్ పోర్టుల కోసం సూచనలు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని గుర్తించి ఇస్తే నిర్మాణానికి సహకారం అందిస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు.