Visakhapatnam Chennai Industrial Corridor Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ రెండో దశ పనులను వేగవంతం చేస్తోంది. రూ.800 కోట్లతో చేపట్టే పనులకు ఆమోదం తెలిపింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో ఈ ప్రాజెక్టును 2026 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా ప్రభుత్వం క్లియర్ చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పారిశ్రామిక ప్రాంతాలకు మరింత అభివృద్ధి చేకూరుతుంది.