AP Flood Victims Bharat Biotech Rs 1 Crore: ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితుల సహాయార్థం భారత్ బయోటెక్ సంస్థ భారీ మొత్తంలో విరాళం ప్రకటించింది. రూ. కోటిని ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమ చేసినట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. ఈ సాయం వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని.. త్వరలోనే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు ఎల్ల దంపతులు తెలిపారు. మరికొందరు కూడా రూ.25 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అందజేశారు.