Srikakulam District Cargo Airport: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్గో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. దాదాపు 1200 ఎకరాల్లో ఈ విమానాశ్రయం నిర్మించనున్నారు. ఈ మేరకు కీలక సమావేశం నిర్వహించారు. విమానాశ్రయం ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. భూసేకరణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల రుణం తీసుకోనుంది.