ఏపీలో మరో కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సిర్మా గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సిర్మా గ్రూప్ పంపిన ప్రతిపాదనలకు ఏపీ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఏపీలో సిర్మా గ్రూప్ రూ.1593 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 2100 మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. మరోవైపు దేశంలోనే అతిపెద్దదైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు తయారీ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు చేసేందుకు సిర్మా గ్రూప్ ముందుకు వచ్చింది.