Tillman Global Holdings Data Centre Rs 15000 Crore In Vizag: విశాఖపట్నంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ 300 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందం ద్వారా విశాఖపట్నం టెక్నాలజీ రంగంలో మరింత అభివృద్ధి చెంది, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 2028 నాటికి ప్రత్యక్షంగా 200-300, పరోక్షంగా 800-1,000 ఉద్యోగాలు వస్తాయంటున్నారు.