Ap Weather Today: దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ చత్తీశ్ఘడ్, ఒడిస్సా ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ, ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశగా ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.. తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ.. ఆ తర్వాత వర్షాలు పడుతున్నాయి.