Andhra Pradesh Microsoft Research Center: ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి! ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకోగా, మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ మేరకు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మించనున్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ముందుండటంతో పరిశోధన కేంద్రం కోసం అమరావతిని ఎంచుకుంది.