AP Weather Today: ఏపీలో విభిన్నమైన వాతారవణం కనిపిస్తోంది.. కొన్ని జిల్లాల్లో ఎండలు, మరికొన్ని జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. రాయలసీమతో పాటుగా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత, ఉక్కపోత వాతావరణం ఉంది. మరికొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం వరకు ఎండలు, ఆ తర్వాత వర్షాలు పడుతున్నాయి. జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల్లో కదలిక మొదలై వర్షాలు ఊపందుకుంటాయి అంటున్నారు.