పేదరికంతో వైద్య విద్యకు బ్రేక్‌.. స్టూడెంట్ డాక్టర్ కల కోసం గురువు తపన, సాయం కోసం విజ్ఞప్తి

1 hour ago 1
డాక్టర్‌ అయి పేదలకు సేవ చేయాలన్నది ఆ విద్యార్థి లక్ష్యం. అందుకోసం కష్టపడి చదివాడు. ఎలాంటి కోచింగ్‌ లేకుండానే నీట్‌లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ సీటు సంపాదించాడు. అయితే అతడి ప్రతిభకు పేదరికం అడ్డుగోడగా మారింది. తండ్రి మరణం.. తల్లి కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి.. సొంత ఇల్లు కూడా లేని దీనస్థితి. వెరసి మెడిసిన్ కొనసాగించడం భారంగా మారింది. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థి ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. అయితే తన విద్యార్థి కల ఎక్కడ ఆగిపోతుందోనని ఆందోళన చెందిన ఓ గురువు.. అతడి చదువు కొనసాగించేందుకు దాతల సాయం కోరుతూ ముందుకొచ్చారు.
Read Entire Article