విశాఖపట్నంలో మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. జీఎంఆర్ ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే విశాఖలో జీఎంఆర్ ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు జీఎంఆర్ అధినేత మల్లిఖార్జున రావు తెలిపారు. అలాగే వచ్చే ఏడాదిలోగా అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బీట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్ ఈ సమావేశంలో తెలిపారు.