Ap Weather Today: ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి.. వాయువ్య బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. ఇవాళ కోస్తాలని పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తా జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఏడాది ఏపీని వరుసగా అల్పపీడనాలు టెన్షన్ పెట్టాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏకంగా ఎనిమిది అల్పపీడనాలు ఏర్పడ్డాయి.