AP 10th Class Certificate Digitalization: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి సర్టిఫికెట్లు ఇక నుంచి ఆన్లైన్ ద్వారా అందుబాటులో తీసుకొస్తున్నారు. 1969-1990 సంవత్సరాల మధ్య ఉన్న సర్టిఫికెట్ల డిజిటైజేషన్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు 1991-2003 సంవత్సరాల మధ్య ఉన్న సర్టిఫికెట్లను కూడా డిజిటైజ్ చేయనుంది ప్రభుత్వం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.