Andhra Pradesh Pm Surya Ghar Scheme Benefits: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన' పథకం ద్వారా ప్రజలకు కరెంట్ బిల్లుల నుండి ఉపశమనం కలిగించనుంది. ఈ పథకం కింద ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్ల వరకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, అదనపు విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వానికే అమ్ముకోవచ్చు. ఈ పథకం ద్వారా 20 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.