ఏపీ ఎన్నికల సందర్భంగా అర్హులైన వారికి 50 ఏళ్లకు పింఛన్లు అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలలో అర్హులైన వారికి 50 ఏళ్లకు పింఛన్లు అందిస్తామని అప్పట్లో కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ హామీ అమలుపై వైసీపీ ఎమ్మెల్సీలు.. శాసనమండలిలో ప్రస్తావించారు. 50 ఏళ్లకు పింఛన్లు ఎప్పటి నుంచి అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ సభ్యులకు సమాధానం ఇచ్చారు.