ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్ మోసాల నుంచి 80 లక్షలకు పైగా ఎయిర్‌టెల్ వినియోగదారులను 36 రోజుల్లో అధునాతన మోస గుర్తింపు వ్యవస్థ ద్వారా కాపాడారు. కృత్రిమ మేధస్సు ఆధారిత ఈ వ్యవస్థ నిజ సమయంలో హానికర లింక్‌లను నిరోధిస్తుంది. ఫిషింగ్ లింక్‌లు, నకిలీ డెలివరీలు, బ్యాంకింగ్ హెచ్చరికల ద్వారా మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ సొల్యూషన్ కుటుంబాలు, వృద్ధులు, విద్యార్థుల వంటి వారికి డిజిటల్ రక్షణ అందిస్తుంది. ఇది ఉచితంగా అందిస్తున్న సేవ.