Andhra Pradesh Anganwadi Workers Gratuity Soon: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే జీవోను జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలుతో ఏటా ప్రభుత్వంపై అదనంగా రూ.10 కోట్లు భారం పడనుంది. రాష్ట్రంలో లక్ష మందికి ప్రయోజనం కలుగుతుంది.