ఏపీలో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. సత్యసాయి జిల్లాలో చాకర్లపల్లి రైల్వే స్టేషన్‌ను రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న శనివారం ప్రారంభించారు. సుమారుగా నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వేస్టేషన్‌లో ఆధునికీకరణ పనులు చేపట్టారు. మరోవైపు కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్ రైలుకు హిందూపురం రైల్వే స్టేషన్‌లోనూ హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న జెండా ఊపి ఈ వందే భారత్ రైలును ప్రారంభించారు.