మన్యం జిల్లా కొమరాడ మండలవాసుల నిరీక్షణ ఫలించింది. పూర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి మంజూరు చేసింది. రూ.15.8 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చింది. 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఈ వంతెన నిర్మించాలని నిర్ణయించింది. అయితే వివిధ కారణాలతో వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది.