ఆంధ్రప్రదేశ్‌కు త్వరలోనే కేంద్రం మరో శుభవార్త వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఏళ్లుగా ఉన్న కీలక ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. గ్రీన్ ఫీల్డ్ పోర్టు, ఓడల తయారీ కేంద్రం ఏర్పాటుచేయాలంటూ గత కొన్నేళ్లుగా బాపట్ల జిల్లా వాసులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్రం వద్దకు చేరగా.. కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తునేదీ చూడాలి మరి.