AP Govt Decision On Punugu Pilli: ఏపీ ప్రభుత్వం అరుదైన జంతువుల్ని సంరక్షించేందుకు సిద్ధమైంది. తిరుమల శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలలో వినియోగించే తైలం పునుగు పిల్లుల నుంచి వస్తుంది. అందుకే వీటిని సంరక్షించాలని నిర్ణయించారు. దీని కోసం టీటీడీ పంపించిన ప్రతిపాదనల్ని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. తిరుపతి ఎస్వీ జూపార్కులో గుహలు, గబ్బిలాల స్థావరాలు, ప్రదర్శన బోర్డుల ఏర్పాటు, వాల్ పెయింటింగ్ వంటి వాటి కోసం నిధులు కేటాయిస్తారు.