Andhra Pradesh Municipal Workers Strike From June 22nd: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికులు ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగనున్నారు. జీతాలు పెంచాలని కోరుతూ కార్మిక సంఘం సమ్మె నోటీసు జారీ చేసింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు సిద్ధమైనట్లు యూనియన్ తెలిపింది. మరోవైపు, ఈ నెల 19న జరగాల్సిన కేబినెట్ భేటీ 24కు వాయిదా పడింది. ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్‌గా టి.నాగలక్ష్మి నియమితులయ్యారు. రతన్ టాటా ఐటీ ఇన్నోవేషన్ హబ్ కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది.