Andhra Pradesh Prisoners Release: ఆంధ్రప్రదేశ్ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంచి ప్రవర్తన కలిగిన 17 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేసిన ఈ ఖైదీలకు కొన్ని షరతులు వర్తిస్తాయి. విడుదలైన ఖైదీలు ఎలా మసులుకుంటారో వేచి చూడాలి. జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి ఇది వారికి ఒక అవకాశం. అర్హులైన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది.