Ongole West New Bypass: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానంగా రోడ్లకు సంబంధించిన పనుల్ని చేపట్టింది.. తాజాగా కేంద్రం సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా నేషనల్, స్టేట్ హైవేలు.. బైపాస్‌లు, ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలను నిర్మిస్తోంది. ఈ మేరకు తాజాగా మరో బైపాస్ రోడ్డు నిర్మాణం తెరపైకి వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బైపాస్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.