ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అబ్కారీశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద మద్యం బ్రాండ్ల విక్రయాలను నిలిపివేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. నాణ్యమైన మద్యం మాత్రమే అందుబాటులో ఉండాలన్న సీఎం.. నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వంటివి కనిపించకూడదని స్పష్టం చేశారు. పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చే విషయమై కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించారు.