తెలంగాణ సర్కార్ సరికొత్త బంపరాఫర్ ప్రకటించింది. కొత్త పథకానికి పేరు సూచించిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని వెల్లడించింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు కసరత్తులు చేస్తుండగా.. ఆ పథకానికి పేరు పెట్టాలని భావిస్తోంది. అత్యుత్తమమైన పేరు సూచించిన వారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఈనెల 28 వరకే ఛాన్స్ అని తేల్చి చెప్పింది.