Anakapalli Nookambika Ammavari Jatara State Festival: ఏపీీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఉత్తరాంధ్రవాసుల ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేసింది. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరకు రాష్ట్ర పండగగా గుర్తింపు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నూకాంబిక జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.. తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.