Punganur Constituency In Annamayya District: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో కీలక మార్పులు చేసింది. ప్రజల కోరిక మేరకు పుంగనూరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలను అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్‌కు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల చిత్తూరు జిల్లాలో మండలాల సంఖ్య తగ్గుతుంది. ఈ మార్పుల వెనుక అసలు కారణం ఏంటి? మరి ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయా? వేచి చూడాల్సిందే!