ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు ఏర్పాటు కానుంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలోని దిండి వద్ద సమీకృత ఆక్వా పార్కు ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. దిండి ఆక్వా పార్కు కోసం మత్స్యశాఖ అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లు ఖరారైన తర్వాత.. సీఎం చేతుల మీదుగా దిండి ఆక్వా పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. రూ.88 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనుండగా.. కేంద్రం 60 శాతం వాటా నిధులు కేటాయించనుంది.