Andhra Pradesh PMAY Rs 2.50 Lakhs: ఆంధ్రప్రదేశ్‌లోని గృహ నిర్మాణదారులకు శుభవార్త! కాకినాడ జిల్లాలో సొంత స్థలం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గృహాలు మంజూరు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-2.0 పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. దీని ద్వారా 2,226 మంది లబ్ధి పొందనున్నారు. త్వరలోనే మరిన్ని నియోజకవర్గాల పరిధిలో ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.