భవన నిర్మాణ అనుమతులపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఏపీ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గైడ్‌లైన్స్ విడుదల చేశారు. భవన నిర్మాణ అనుమతులను ఇప్పటి వరకూ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు జారీ చేస్తుండగా.. ఇకపై పట్టణ స్థానిక సంస్థలు జారీ చేయనున్నాయి. అయితే సీఆర్డీఏ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. అలాగే 300 చదరపు మీటర్లు దాటని భవన నిర్మాణాలకు స్వయంగా యజమానులే దరఖాస్తు చేసుకోవచ్చు.