AP Govt Matsyakara Sevalo Scheme: ఏపీ ప్రభుత్వం సముద్రంలో చేపల వేటపై 61 రోజుల పాటు ప్రభుత్వం నిషేధం విధించనుంది. మత్స్యసంపద వృద్ధికి ఆటంకం కలగకుండా ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు అమలు చేపల వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ వేట విరామ సమయంలో మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు, బోట్లు, వలలు సీజ్ చేస్తారు. అయితే వేట విరామ సమయంలో మత్స్యకారుల సేవలో పథకం కింద రూ.20వేలు సాయం అందించనున్నారు.