Vijayawada Ggh Monkeypox Special Ward: విజయవాడలో ఎంపాక్స్ అంటూ వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సుహాసిని స్పందించారు. ఇప్పటివరకు జిల్లాలో ఎవరికి ఎంపాక్స్ లక్షణాలు గుర్తించలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. విషయాన్ని విజయవాడ ప్రభుత్వ పీడియాట్రిక్స్ హెచ్‌వోడి అనిల్ కుమార్ తెలిపారు. ఇటు విజయవాడ జీజీహెచ్‌లో కూడా ముందస్తు జాగ్రత్తగా.. ఆరు పడకలు, అత్యాధునిక వైద్య పరికరాలతో ఎంపాక్స్ ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు.