ఏపీలో ఎన్డీఏ కూటమి విజయానికి ఏడాది.. నెరవేరిన ఆ జిల్లావాసుల కల..

9 months ago 33
అనంతపురం జిల్లా వాసుల ఎదురుచూపులు ఫలించాయి. ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అనంతపురం బెంగళూరు ప్యాసింజర్ రైలు పరుగులు తీయడం ప్రారంభించింది. పుట్టపర్తి - బెంగళూరు మధ్యన నడిచే ప్యాసింజర్ రైలును అనంతపురం నుంచి నడపాలని ఏళ్ల నుంచి అనంతపురం వాసులు కోరుతున్నారు. ఎంపీలు అంబికా లక్ష్మినారాయణ, పార్థసారథి ఈ విషయంపై కేంద్రాన్ని అభ్యర్థించారు. ఎట్టకేలకు ఈ రైలును అనంతపురం నుంచి నడిపేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. దీంతో జూన్ నాలుగో తేదీ నుంచి అనంతపురం బెంగళూరు ప్యాసింజర్ రైలు ప్రారంభమైంది. ఈ రైలులో రూ.50ల టికెట్‌తోనే అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లొచ్చు.
Read Entire Article