Andhra Pradesh Mlas Mlcs Games: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.ఈ పోటీల కోసం పలువురు ఎమ్మెల్యేలు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఈ పోటీలు రాజకీయ ఒత్తిడిని తగ్గించడంతో పాటు సభ్యుల్లో స్నేహభావాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయంటున్నారు. మార్చి 20న సీఎం చంద్రబాబు చేతులమీదుగా బహుమతుల ప్రదానం చేయాలని నిర్ణ యించారు.ఈ పోటీలు ఉత్సాహభరితంగా సాగాలని, ప్రతి ఒక్క ఎమ్మెల్యే పాల్గొనాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.