ఆంధ్ర ప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. . ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ వెలువరించింది. అయితే ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయటంతో.. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు స్థానాలు ఎన్డీఏ కూటమి ఖాతాలోకే వెళ్లాయి. టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటి నాయుడు, బీజేపీ నుంచి సోము వీర్రాజు, జన సేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.