Andhra Pradesh Ropeways To Come Up In 5 Tourist Spots: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రోప్‌వేల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తోంది. ఐదు ప్రాంతాల్లో పీపీపీ విధానంలో రోప్‌వేలు నిర్మించాలని యోచిస్తోంది. చిత్తూరులోని బోయకొండ గంగమ్మ ఆలయం, అహోబిలం, కోటప్పకొండ, విజయవాడ భవానీద్వీపం, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. డ్రోన్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి 'ఏపీ డ్రోన్ మార్ట్' పోర్టల్ రానుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీని అభివృద్ధి చేయనున్నారు.