Chandrababu Announced Rs 5 Crore In Collectors Conference: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. అయితే ఈ సదస్సులో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ నిధుల అంశాన్ని ప్రస్తావించారు.. వెంటనే స్పందించిన చంద్రబాబు జిల్లాకు రూ.5 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రకటించారు. అధికారులు సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు.